Tuesday 1 January 2013

కొంచెం ముక్కు మూసుకోండి

ఏమిటి ఇది అందమా అంటారా?భలే వాళ్ళే ఇది మీరు
NH.5 నుండి నాయుడుపేటకు వచ్చే దారిలో ఉన్న
మా ఊరి ''డంప్ యార్డ్''....''చెత్త స్తలం''....
మరేమో ఇప్పుడే ముక్కు మూసుకుంటూ ఉన్నారే ...
అది మా స్తలం మీరు వాడ కూడదు అని రైల్వే వాళ్ళు,
మాకు డంప్ యార్డ్ లేదు అదే వాడుతాము అని మా
పంచాయతీ వాళ్ళు గొడవలు పెట్టుకొని ....బాగు చేసే వాళ్ళు
లేక అలా అయిపోయంది.
అసలు నేను స్కూల్  కి అదే దారిలో వెళ్ళాలి ,చేతులు స్కూటీ
నుండి తియ్యలేక ,ముక్కు మూసుకోలేక నరక యాతన.

ఏదో తెలుగు సభలు జరిగిన అదృష్టం........
మహా మహులు ఆ దారిలో వెళ్ళిన అదృష్టం.....
కొంచెం సున్నం చల్లి ఇదిగో ఈ మాత్రం  ఉంది.

ఇక్కడేదో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.కొంచెం ఆ
మీథేన్ ని గ్యాస్ గా మార్చే మార్గం చెప్పండి :)




ఇంకా ఫోటోలు తీద్దాము అనుకున్నాను కాని....అప్పటికే అక్కడ వెళ్ళే జనాలు
ఈ మేడం పందులకు ఎందుకు ఫోటోలు తీస్తుంది అని అర్ధం కాక ...జుట్టు పీక్కుంటున్నారు.
అందుకు ఆపేసి వచ్చేసాను :)



13 comments:

మాలా కుమార్ said...

అలాగే , ఓ చేత్తో ముక్కు మూసుకొని , ఓచేత్తో టైప్ చేస్తున్నాను :)
మీరు మంచి మంచి చిత్రాలు పెట్టాలని కోరుకుంటూ బెస్టాఫ్ లక్ .

శశి కళ said...

thank you mala garu.first comment meede :))

జ్యోతిర్మయి said...

శశి కళ గారు మీకు భలే ఆలోచన వచ్చిందే. మంచి చిత్రాలతో పాటు ఇలాంటివి కూడా చూడాలి లెండి. మన బాధ్యత గుర్తొస్తుంది.

Maitri said...

సరేలెండి. పందులకేమిటి అన్నవాళ్ళకి మీకు "కలాపోషన " ఎక్కువని చెప్పండి .

panasakarla said...

tappu enta chetta poguchesina manada chetta tiyyani adhikarulada?



Kalyan said...

dheenendhuku inko vidanga anuko koodadhu - pandhulaku kooda swecha nichhina nela ani ;)

శశి కళ said...

జ్యోతిర్మయీ గారు ఇలాగ ప్రోత్సాహం ఇవ్వాలే కాని అంట కంటే భాగ్యమా:)

శశి కళ said...

క్రి గారు కళా పోషణ కాదు ,సమస్యా పోషణ థాంక్యు :))

శశి కళ said...

ప్రకాష్ ...స్తలం ఇవ్వని దేవుడిది:))

శశి కళ said...

కళ్యాన్ :))))

జైభారత్ said...

మంచి సమస్యను ఫోకస్ చేశారు....మనం ఏదైనా చేద్దాం... శశి గారు... ఆలోచించండి.

శశి కళ said...

ఇప్పుడే విన్నాను జై ..ఆటో లో కవర్స్ నిషేదించారు అని చెపుతున్నారు.
హైదరాబాద్ లో చెత్త అబ్బాయి వస్తే విజిల్ వేస్తె మనం కవర్ లో చెత్త కట్టి
వేస్తున్టాము.అలా అపార్ట్మెంట్స్ వాళ్లు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే వీధులు బాగుంటాయి ఏమో.ఆ చెత్త ఊరికి కొంచెం దూరం లో ఉంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఆ వాసనకే చాలా జబ్బులు వస్తాయి

Anonymous said...

Shashikala garu.. Good one andi... edo ala net lo search chestunte mee blog choosanu.. good work... A Reader from New York

Post a Comment