Wednesday 2 January 2013

ప్రపంచ తెలుగు మహా సభలు ౨౦౧౨

చెప్పాను కదా తిరుపతి లో తెలుగు సభలకు మొదటి రోజు వెళ్లాను అని.
ఆ ఫోటోలే ఇవి.
మరి తెలుగు రచనా వ్యాసంగం లోనే కాక ,కొత్త బ్లాగ్ విషయం లో సహాయం 
చేసిన వలభోజు.జ్యోతి అక్కకు పోస్ట్ అంకితం.
స్వాతి శంకర్ గారు వేదిక అదుర్స్  అంటే  మీరు ''థాంక్యు''ఎందుకు చెప్పారు?
చెప్పండి ప్లీజ్ 

అదిగో సైకత శిల్పం,పక్కనే కళాకారుడి మొబైల్ నంబర్ 
ఎవరైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి.


అబ్బా యునివర్సిటీ లో లోపలకు దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ లు నడుస్తూ ఉంటె ఇదిగో ఇలాటి వాళ్ళు,
పండరి బజనలు,తప్పెట్లు,నెమలి,పులి వేషగాళ్ళు,ముందు వచ్చే జనాలను చూస్తూ ఆ రష్ లో
వీళ్ళని చూడాలని ...భలే తిక మక పడిపోయాను

ఇదిగోండి ఇదే ప్రధాన వేదిక.పెద్ద తామర పువ్వు ఉంటుంది.మధ్యలో ఈ స్టేజ్ ఉంటుంది.
చూసారు కదా పైన మామిడి ఆకుల తోరణం.చిత్రం ఏమిటంటే దానిలో ఏబైఆరు అక్షరాలు
ఇలు,ఇలూ,ఋ,బండి ర....ఇలా ఒక్కటి కూడా వదలకుండా వేసారు.అలా చూస్తుంటే నాకు
ఎంత సంతోషం వేసిందో.అటు,ఇటు రామప్ప శిల్పాలు వేసి ఉన్నాయి.

కవి సమ్మేళనం లో ''కొప్పర్తి''వారు చెప్పిన కవిత గుర్తుకు వస్తూ ఉంది.
''ఒక్క అక్షరం రాలి పోయినా భాషకు చిల్లు పడ్డట్లే
శబ్దమే ప్రధానం అయిన భాష కదా మనది
ప్రతి అక్షరము దాని ప్రత్యేక  శబ్దము కలదే
జీవ వైవిధ్యం అని చిన్న ప్రాణులను కాపాడుకుంటామే
అక్షరాలను ఎందుకు కాపాడుకోవడం లేదు
అక్షరాలను రాల్చగలవు కాని
ఒక్క అక్షరాన్ని అయినా సృజించగలవా"
వహ్వ....ఏమి చెప్పారో....అసలు  అందరం ఒక్కో మాటకి ఉలిక్కిపడ్డాము.

ఇంకా తిరుపతి కొండ,ముందు స్వర్ణముఖీ నది,పుస్తకం ,ప్రక్కన నాట్యా చార్యులు
....ఎందుకు లెండి.రెండు కళ్ళు చాలలేదు.ఇంకా వేదిక మీద తెలుగు తల్లి విగ్రహం ఉంది.
ఈ సారి పోస్ట్ లో వేస్తాను



5 comments:

శ్రీనివాస్ పప్పు said...

''ఒక్క అక్షరం రాలి పోయినా భాషకు చిల్లు పడ్డట్లే
శబ్దమే ప్రధానం అయిన భాష కదా మనది
ప్రతి అక్షరము దాని ప్రత్యేక శబ్దము కలదే
జీవ వైవిధ్యం అని చిన్న ప్రాణులను కాపాడుకుంటామే
అక్షరాలను ఎందుకు కాపాడుకోవడం లేదు
అక్షరాలను రాల్చగలవు కాని
ఒక్క అక్షరాన్ని అయినా సృజించగలవా"

భాష అవసరాన్ని ఆవశ్యకతని ఎంత చక్కగా చెప్పారో

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ... మిస్సయిన మా లాంటోళ్ళకి ఆ లోటు తీర్చారు ;)

Unknown said...

అద్భుతం.... అంతే వేరే మాట లేదు.

శశి కళ said...

పప్పు గారు,రాజ రావ్ అన్నయ్య థాంక్యు

థాంక్యు రాజ్.మీ బావ ఒప్పుకోనిఉంటే మూడు రోజులు అక్కడే ఉండేదాన్ని

శశి కళ said...

ప్రకాష్ నీ నాని
కొత్త కోడలు దీపం వెలిగించింది
కరెంట్ ఖర్చు మిగులుతుందా?
బాగుంది.తెలుగు సాఫ్ట్ వేర్ పెట్టిన్చుకోరాదా?

Post a Comment