Thursday 19 May 2016

పెనుగొండ వాసావాంబ

పెనుగొండ వాసావాంబ 

అనంతపురం జిల్లా లోని పెనుగొండ లో 
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం 
నిర్మించి వంద సంవత్సరాలు అయిన 
సందర్భంగా (1916-2016) శతాబ్ది ఉత్సవాలు 
16,17,18-05-2016 మూడు రోజులు నిర్వహించారు . 
దానిలో భాగంగా అన్ని జిల్లాల లోని వైశ్య కవులు 
కవయిత్రులను సన్మానించారు . నేను వెళ్లి 
సన్మానం స్వీకరించి ఆ తల్లి ఆశీస్సులు అందుకొని 
వచ్చాను . మూడో రోజు పూజలు ముగిసేసరికి 
ఉరుములు మెరుపులతో వర్షం అదీ అనంతపురం లో 
ఇంత కంటే ఆ తల్లి ఆశీస్సులకు నిదర్శనం ఇంకేమి  కావాలి !

చూడండి మదుర మీనాక్షి అలంకరణ లో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు 



ఇంకా హోమాలు , గజ గౌరీ వ్రతాలు , పెనుగొండ ఆడపడుచులకు 
వడిబాలు కట్టుట , అమ్మవారిని ఏనుగు పై గ్రామోత్సవము చాలా 
బాగా జరిగాయి . 
గజ గౌరీ వ్రతం లో అమ్మవారు చూడండి 



చక్కగా ఫ్లెక్సీ లు , పందిళ్ళు వేసి అతిధులకు మంచి భోజనం 
మూడు రోజులు ఏర్పాటు చేసి అందరు ఒక్కటిగా పని చేసి 
అమ్మవారి కృపకు ఆర్య వైశ్యులు అందరు పాత్రులు అయ్యారు 
అధ్యక్షులు నాగరాజు గారు ఇంకా ఇతర సభ్యులు ఎంత చక్కగా 
అమ్మవారి శాలువాతో ,1116/- ఇచ్చి యెంత చక్కగా మమ్మల్ని 
సత్కరించారో చూడండి . ఆశావాది ప్రకాశరావు గారి ఆధ్వర్యం 
లో సభ చక్కగా జరిగింది . 






Friday 9 January 2015

మా సంక్రాంతి కొంచెం రుచి చూస్తారా !!

 మా సంక్రాంతి కొంచెం రుచి చూస్తారా !!
ఈ రోజు మా స్కూల్ లో పిల్లలకి కొంత ముందస్తు సంక్రాంతి చూపించాము . 
పిల్లలతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి :)
చూసారా బోగి మంటలు . 



చక్కని రంగవల్లిక 



చూసారా ..... కృష్ణుని మధ్యలో ఉంచి తోటలో బొమ్మల కొలువు !


మరి గోపికలు కావాలి కదా ! ఇదిగో మా పిల్లలు అతిధులను పన్నీరు ,
చేమంతులు గోరింటతో కలిపి కట్టిన పూబంతులు ,రేగు పండ్లతో ఆహ్వానిస్తూ .... 


పిల్లలు చక్కగా చేస్తున్నందుకు అభినందిస్తూ నేను :)



ఎన్ని ఉన్నా మన భోజనం ఉంటేనే కదా మన పండుగ ... 
చూడండి .... బక్ష్యాలు ,అరిసెలు ,వడలు ,పులిహోర ,గోంగూర అన్నం 
అప్పడం ,పుదీనా చట్నీ ,పప్పు ,నెయ్యి ,దొండకాయ ఫ్రై ఇక సాంబారు ,రసం 
గడ్డ పెరుగు .... చాలా ఇంకా కావాలా ?మేము అయితే ఇంక చాలు బాబోయ్ అనేసాము :)

పండుగ వేడుకలు చూసి ఉత్సాహం వచ్చేసి ఇక్కడి వర్కర్స్ పిల్లలకు సంక్రాంతి 
''గొబ్బి పాటలు '' ఎలా నేర్పించారో ఈ వీడియో చూడండి . 
ఇంకా  పిల్లలకు శుభాకాంక్షలు చెప్పండి . 
మీకందరికీ రాబోవు సంక్రాంతి శుభాకాంక్షలు :)
https://www.facebook.com/video.php?v=778176232250240&l=7257635672380202736


students learning ''gobbi songs for pongal in my school''

గాలి పటాలకు బదులు స్కై లాంతర్స్ ఎగురవేసాము చూడండి . 






Tuesday 13 May 2014

ఉరకలెత్తే అందం .... హోగినికల్స్

ఉరకలెత్తే అందం .... హోగినికల్స్ 
 బెంగుళూర్ కి రెండు గంటల ప్రయాణ దూరం లో ఉన్నాయి ఈ ''హోగినికల్స్ ''
జలపాతాలు . ఎండాకాలం సెలవల్లో ఎలాగైనా వాయుగుండ్ల ఫామిలీస్ అందరు 
రోజువారి పనుల నుండి ఆటవిడుపుగా వెళ్ళాలి అని మా మరుదలు ,తోడి కోడళ్ళు 
కలిసి వేసిన ప్లాన్ ఇది . 
అదిగో చుట్టూ రాతి కొండల మీద నుండి కిందకు ఉరికే జలపాతాలు . ఎన్నో దగ్గరల 
ఇలా నీరు ప్రవహించి రాళ్ళ మధ్యలో చిన్న గుహలుగా ఇంకా రాళ్ళు రక రకాల 
రూపాలలో ఏర్పడ్డాయి . చెట్ల వెళ్ళు కూడా రక రకాల రూపాలు . 

మే లో ఎక్కువ జల పాతాలు లేవు కాని ఇప్పుడు ''బోట్ షికారు '' (పుట్టెలు )
ఉంటుంది . ఆగస్ట్ లో పైన కృష్ణ రాజ సాగర్ డాం నుండి నీరు వదిలి నపుడు 
బోలెడు జలపాతాలు కాని బోట్ షికారు ఉండదు . 

ఇదిగో ఇక్కడే మన ప్రయాణం మొదలు అవుతుంది ఆ చిన్న పడవల్లో . శాకాహారులకు 
చుట్టూ అమ్మే చేపలవంటకాలు  చూస్తూ నడవాలి అంటే కష్టమే . తల వంచుకొని నీటి అందాలు 
చూడటమే పరిష్కారం . 


చూసారా .... నీటి ప్రవాహం వలన చెట్ల వేళ్ళు ఎన్ని ఆకారాలు సంతరించుకున్నాయో !

ఇందాక ఎక్కిన బోట్స్ నుండి దిగి ఇక్కడ మళ్ళా ఎక్కుతాము . ఇప్పుడు మనలను 
కొండల మధ్యగా వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకొని వెళుతారు . 



 చూసారా రెండు వైపుల రాళ్ళు నీటి ప్రవాహం వలన ఎలాంటి ఆకారాల్లో ఉన్నాయో !
ఇక్కడ ప్రస్తుతం ఎనబై అడుగుల లోతు నీరు ఉందని చెప్పారు .
ఇలా రాళ్ళ మధ్య ప్రయాణించి ఒక ఏరు లాంటి ప్రదేశానికి చేరుకుంటాము . 
ఇక అక్కడ మసాజ్ లు చేయించు కొనేవాళ్ళు  ,పిల్లలు, తల్లులు,పెద్ద వాళ్ళు  నీళ్ళలో 
ఆటలాడుకుంటూ కనిపిస్తారు . ఈ మసాజ్ లు ఏమిటో బోలెడు నూనెను నీటిలో 
కలిపెస్తూ ,అసలు వాటర్ కూడా మురికిగా అయిపోతున్నాయి . మళ్ళా దీనికి 
కూడా ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలేమో . నాకు విసుగు వేసి కనీసం 
నీళ్ళలో కాలు కూడా పెట్టలేదు . 
ప్రకృతి మనకు  చూచి ఆనందించడానికి బోలెడు అందాలు మనకు ఇస్తే వాటిని పాడు 
చేసి మనం ఆనందం పొందుతున్నాము . ఎవరు నేర్పించాలి మనకు 
మంచి చెడ్డలు ?

Tuesday 12 November 2013

కధలు .... బాబోయ్ కధలు :)


స్వాగతం ..... సుస్వాగతం . మా స్కూల్ లో 8/11/2013 నుండి 12/11/2013 వరకు నేను ఒక
కధా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాను . ఈ రోజు పోటీ నిర్వహించాము .

ఏదో పది లేదా ఇరవై కధలు వస్తాయి అనుకున్న మాకు  ఐదు నుండి సీనియర్ ఇంటర్
పిల్లల వరకు కలిసి ఏకంగా ''నూటా ఐదు ''కధలు మా దోసిట్లో  పోసేసరికి కళ్ళు తిరిగినంత
పని అయింది . ఇంకా విశేషం ఏమిటంటే ''వాళ్ళ కధలకు వాళ్ళే బొమ్మలు కూడా వేసారు ''

చిన్నప్పటి కధలు , సృజనాత్మక కధలు ,నీతి కధలు ,హాస్య కధలు ,జంతువుల కధలు ,
ఇంకా .... అనువాద కధలు . చక్కగా మంచి కధనం తో ఇంగ్లీష్ కధలను కూడా అనువదించేసారు .

ఈ రోజు నెల్లూరు బాల భవన్ డైరక్టర్ గారు వారికి షీల్డ్స్ ,సర్టిఫికెట్స్ ఇచ్చారు ,
ఈ విశేషాలు చూడాలి అంటే ''పద్నాలుగో తేది ఈ టివి టు లో ఆంధ్రావని ''లో చూడండి .

ఈ కధలు ఏమి చేయాలి అన్నదే ఇప్పుడు నాకు సమస్య .








Monday 7 October 2013

What's going on?

Wednesday 26 June 2013

ప్రకృతి కాంత కు ఎన్నెన్ని హొయలో ....









చిట్టి మబ్బు .... చిట్టి మబ్బు ఎక్కడున్నావే ?రా చక చక రా .... 
అనగానే ఇదిగో ఇలాగ మా దగ్గరకు వచ్చేస్తుంది . 
హమ్మయ్య వాన వస్తుంది అనుకోగానే ఇదిగో మా సూర్యం బాబు 
ఇలాటి ఫోజు లు ఇచ్చేస్తాడు .... నల్ల తెర లో నుండి తొంగి చూస్తూ 

ప్రకృతి కాంత కు ఎన్నెన్ని హొయలో .... 


కరకు గర్జనల మేనికి మెరుపు హంగు గూర్చిన వాడినేమి అడిగేది ?ఏమి కోరేది ?వాడి నేమి అడిగేది ?



ఇదిగో సాయంత్రం ఇలాంటి పెయింటింగ్స్ ప్రకృతి చూపిస్తూ ఉంటె .... సాండ్ పెయింటింగ్స్ మారినట్లు
సేకనకు ఒక సారి మారిపోతూ ఉంటె ... అబ్బ ఒకటే క్లిక్ అనిపించడమే :)

ఎలా ఉంది?అర గంటలో పాపం మా సూర్యం బాబు ఇలాగ లైటింగ్ మారుస్తూ ,ఫోజ్ లు
మారుస్తూ మూడు వందల అరవై ఫోజులు పెట్టాడు అనుకోండి

అన్ని పెడితే బోర్ కొడుతుందేమో అని పెట్ట లేదు . పాపం ఈయన రెస్ట్  తీసుకో ,ఇవన్ని ఎందుకు  అంటారు .
నాకు ఇలా ఆకాశం చూస్తేనే  బోలెడు రెస్ట్ ..... ఈ సారి ఇంకొన్ని ఫోటో లతో


Tuesday 4 June 2013

మా సూర్యం బాబు గారు :)

ఇదిగో చూడండి మా సూర్యం బాబు గారు ఆకాశం లో ఆఫీస్ చూసుకొని 
భూదేవి వైపు చూస్తున్నాడు 

అక్కడ నుండి చూసేసరికి భూదేవి మీద బోలెడు ప్రేమ వచ్చింది చూడండి 


కనిపించిందా ? ఇంకా చుట్టూ ఏదో గుఱ్ఱం ఆకారం గమనించారా ?

ఇక్కడ చూడండి సూర్య నారాయణ్ గారు ఎలా ఉన్నారో ?కింద ఉన్నది నేల ..... 
అది ఎండిపోయిన మా స్వర్ణముఖి నది అన్న మాట . 
ఇవండీ మా కొత్త అపార్ట్మెంట్ పై నుండి నా కన్ను చూసిన దృశ్యాలు :))