Friday 9 January 2015

మా సంక్రాంతి కొంచెం రుచి చూస్తారా !!

 మా సంక్రాంతి కొంచెం రుచి చూస్తారా !!
ఈ రోజు మా స్కూల్ లో పిల్లలకి కొంత ముందస్తు సంక్రాంతి చూపించాము . 
పిల్లలతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి :)
చూసారా బోగి మంటలు . 



చక్కని రంగవల్లిక 



చూసారా ..... కృష్ణుని మధ్యలో ఉంచి తోటలో బొమ్మల కొలువు !


మరి గోపికలు కావాలి కదా ! ఇదిగో మా పిల్లలు అతిధులను పన్నీరు ,
చేమంతులు గోరింటతో కలిపి కట్టిన పూబంతులు ,రేగు పండ్లతో ఆహ్వానిస్తూ .... 


పిల్లలు చక్కగా చేస్తున్నందుకు అభినందిస్తూ నేను :)



ఎన్ని ఉన్నా మన భోజనం ఉంటేనే కదా మన పండుగ ... 
చూడండి .... బక్ష్యాలు ,అరిసెలు ,వడలు ,పులిహోర ,గోంగూర అన్నం 
అప్పడం ,పుదీనా చట్నీ ,పప్పు ,నెయ్యి ,దొండకాయ ఫ్రై ఇక సాంబారు ,రసం 
గడ్డ పెరుగు .... చాలా ఇంకా కావాలా ?మేము అయితే ఇంక చాలు బాబోయ్ అనేసాము :)

పండుగ వేడుకలు చూసి ఉత్సాహం వచ్చేసి ఇక్కడి వర్కర్స్ పిల్లలకు సంక్రాంతి 
''గొబ్బి పాటలు '' ఎలా నేర్పించారో ఈ వీడియో చూడండి . 
ఇంకా  పిల్లలకు శుభాకాంక్షలు చెప్పండి . 
మీకందరికీ రాబోవు సంక్రాంతి శుభాకాంక్షలు :)
https://www.facebook.com/video.php?v=778176232250240&l=7257635672380202736


students learning ''gobbi songs for pongal in my school''

గాలి పటాలకు బదులు స్కై లాంతర్స్ ఎగురవేసాము చూడండి . 






2 comments:

Girija said...

స్కై లాంతర్స్ తయారీ గురించి వెతుకుతుంటే మీ పోస్ట్స్ కనిపించింది. చాలా బాగుంది. పాఠాలతో పాటే సంప్రదాయాలు సరదాసరదాగా తెలియజేస్తున్నారు.

శశి కళ said...

thanks andi

Post a Comment