Wednesday 13 February 2013

బాదంచెట్టు గుర్తు ఉందా?


తోలి సంధ్య వేళలో....ఇదిగో మా స్కూల్ బాదం చెట్టు నుండి ఇలా పలకరిస్తున్నారు .....కిరణమై మెరుస్తూ సూర్యుడుగారు

ఇదిగో బాదం పూత....
నల్ల తుమ్మ చెట్టు పూలు కొంచెం ఇలాగే ఉంటె దానిని స్వర్ణ పుష్ప అంటారు అంట.
మరి దీనిని ''శ్వేత నక్షత్ర పుష్ప''అనొచ్చు కదా
అవిగో పచ్చి బాదం కాయలు.మీకేమి లేవా బాదం చెట్టు ఎక్కిన అనుభవాలు?
గోడ ఎక్కి చెట్టు మీద కూర్చొని అన్ని రకాల కాయలు కోసి యెంత కాయ అయితే పప్పు
వస్తుంది అని పరిశోధన లు చేసేదాన్ని ....:)

ఇదిగో పండిన పండు.మా చిన్నప్పుడు పండు ఎర్రగా ఉండేది.....దాని తోలు కూడా తినేవాళ్ళం.
మరి ఇవి హైబ్రీడ్ కాబోలు ఇలా మట్టి రంగులో ఉంటాయి.మా స్కూల్ లో ఇవే కాదు,
నేరేడు,ఉసిరి,రేగు ఇలా చాలా చెట్లు ఉన్నాయి.ఎక్కువ మాత్రం ఇవే....కిటికీలు పక్కన నిలబడి
యెంత ఎండాకాలం అయినా వేడి గాలి తరగతి గదుల్లోకి రాకుండా కాపాడుతూ ఉంటాయి .
హ్మ్....కాకి ఫోటో ఎందుకు పెట్టావు అంటారా?ముందు ముందు ఒక వేల ఇవి కనపడ లేదు అంటే 
నా బ్లాగ్ లో ఉన్నాయి చూడండి అని చేపుదాము అని.మీకు తెలుసా ఇవి బాదం చెట్టు మీదే గూళ్ళు 
ఎక్కువగా పెడుతాయి.ఇక స్పూన్స్,సబ్బులు అన్నీ తీసుకుని పోయి గోల చేస్తుంటాయి .

బోలెడు ఉసిరి చెట్లు ఉంటాయి.చూసారా ఎక్కువగా కార్తీక మాసం ఈ చెట్టు కింద
లంచ్ బెల్ లో పూజ చేసుకొని వన భోజనాలు తింటూ ఉంటాము.సెలవు పెట్టె అవసరం లేకుండా :)

15 comments:

కిరణ్ కుమార్ కే said...

బాగున్నాయండి మీ ప్రక్రుతి చిత్రాలు.

మాలా కుమార్ said...

మాబాదం చెట్టు గుర్తులు లేకేమి బోలెడు వున్నాయి .కాని పాపం బలైపోయిందికదా !గుర్తుతెచ్చి బాధపెడుతున్నారు శశీ :)

Anonymous said...

మా స్కూల్ లో ఇవే కాదు,
నేరేడు,ఉసిరి,రేగు ఇలా చాలా చెట్లు ఉన్నాయి.ఎక్కువ మాత్రం ఇవే.
meeki poshak viluvalki balishtam ayina khana milne ke liye subh nayak ki khal nayak

mustafalla jiyaudden
bhindi bazaar

Anonymous said...

బావున్నాయి శశి గారు

హరే కృష్ణ said...

మొదటి ఫోటో చాలా బావుంది శశి గారు!

Anil Dasari said...

ఆ కాకి ఏకాకి

Anonymous said...

Yes Madam, I too got sweet memories. In those days fruits were red, sweet-sour taste. Within 10-15 years beautiful world became horrible. One Big almond tree in postoffice beside my residence and it is parallel to our balcony and accessible. Thanks I coud recollect such a nice memory.

Unknown said...

Very nice... and good memories

Chandu S said...

ఫోటోలు బావున్నాయి. బ్లాగు చాలా అందంగా ఉంది శశి గారు .

శశి కళ said...

green tree gaaru thank you

mala akka nijame sorry

శశి కళ said...

abraka dabra gaaru (ee peru kashtam gaa undi ) thank you

andy,anonymous gaaru thank you

శశి కళ said...

shailaja gaaru ,raja annayya thank you

కిరణ్ కుమార్ కే said...

>>green tree gaaru thank you

lol

నేను Green Star ను అండి, Green tree కాదు. ఇంకా నయం Green Tea అని నన్ను తాగేయ్యలేదు.

:))

శశి కళ said...

మరి అందుకే పేరు చెప్పమనేది....ఇలాగా పెట్టు కోకుండా (జస్ట్ కిడ్డింగ్)

N.V. SIVA RAMA KRISHNA said...

బాదరబందిలేని బాల్యపు జీవనం
తలచిన క్షణంలో అపూర్వ భావనం!
బాదం చెట్టు మధ్యలో ఎండ కిరణం
ఉసిరి నీడలో కార్తికమాస సదనం!
అందిన మానుతో ఆకలి మదనం
కాకిగోలతో ఆటపాటల సందడి మయం
ఆదరాబాదర భరిత నేటికి అన్ని "శశికళ"లే!

Post a Comment