Friday 22 February 2013

కొంచెం హుషారు...కొంచెం జ్ఞానం

స్వాగతం ....మా స్కూల్ లో 20,21/02/2013 లో ''ప్రపంచ మాతృభాష దినోత్సవం ''
సందర్భంగా నాటికల పోటీలు జరిపాము.నన్ను పిల్లలు ఆహార్యానికి,కధకు
సహాయం చేయమన్నారు కాని ఇవి పోటీలు కాబట్టి,అదీ కాక పిల్లలు సర్వతోముఖాభివృద్ధి
చెందేలా చేయడం నాకు ఇష్టం కాబట్టి వారినే చేసుకోమన్నాను.ఎంత చక్కగా
చేసుకున్నారో చూడండి

ఇది ఎనిమిదో తరగతి వారి ''అడివి జంతువుల ఆవేదన''నాటిక.
దీనిలో ఏనుగు వేషం వేసిన అమ్మాయికి ఉత్తమ నటి బహుమతి వచ్చింది.
ఇది ఐదవ తరగతి వారు వేసిన ''కాకి పిచుక నాటిక''దీనికి ప్రత్యెక బహుమతి

ఇది తొమ్మిదో తరగతి వాళ్ళు వేసిన ''పరమానందయ్య శిష్యుల నాటకం (గుస్వం)''
దీనికి రెండో బహుమతి వచ్చింది
ఇది తొమ్మిదో తరగతి వాళ్ళు వేసిన ''మాతృత్వం''నాటిక.పట్టణానికి వెళ్ళిన అబ్బాయి చెడుఅలవాట్లు
నేర్చుకొని అమ్మా నాన్నని మర్చిపోతే వాళ్ళు బాధ పది చనిపోవడం చూపారు.వాళ్ళే కధ వ్రాసుకున్నారు.
దీనిలో అదిగో మైక లో మాట్లాడుతున్నా అమ్మాయికి ఉత్తమ నటి బహుమతి
ఇది ఏడో  తరగతి వారి ''తెలుగు వెలుగు'' దీనిలో కూడా ఉత్తమ నటి వచ్చింది .నాటకానికి తృతీయ బహుమతి

ఆరోతరగతి వాళ్ళు ''ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి''అని వాళ్ళే నాటిక వ్రాసి వేసారు.
ముచ్చటగా ఉంది.


Wednesday 13 February 2013

బాదంచెట్టు గుర్తు ఉందా?


తోలి సంధ్య వేళలో....ఇదిగో మా స్కూల్ బాదం చెట్టు నుండి ఇలా పలకరిస్తున్నారు .....కిరణమై మెరుస్తూ సూర్యుడుగారు

ఇదిగో బాదం పూత....
నల్ల తుమ్మ చెట్టు పూలు కొంచెం ఇలాగే ఉంటె దానిని స్వర్ణ పుష్ప అంటారు అంట.
మరి దీనిని ''శ్వేత నక్షత్ర పుష్ప''అనొచ్చు కదా
అవిగో పచ్చి బాదం కాయలు.మీకేమి లేవా బాదం చెట్టు ఎక్కిన అనుభవాలు?
గోడ ఎక్కి చెట్టు మీద కూర్చొని అన్ని రకాల కాయలు కోసి యెంత కాయ అయితే పప్పు
వస్తుంది అని పరిశోధన లు చేసేదాన్ని ....:)

ఇదిగో పండిన పండు.మా చిన్నప్పుడు పండు ఎర్రగా ఉండేది.....దాని తోలు కూడా తినేవాళ్ళం.
మరి ఇవి హైబ్రీడ్ కాబోలు ఇలా మట్టి రంగులో ఉంటాయి.మా స్కూల్ లో ఇవే కాదు,
నేరేడు,ఉసిరి,రేగు ఇలా చాలా చెట్లు ఉన్నాయి.ఎక్కువ మాత్రం ఇవే....కిటికీలు పక్కన నిలబడి
యెంత ఎండాకాలం అయినా వేడి గాలి తరగతి గదుల్లోకి రాకుండా కాపాడుతూ ఉంటాయి .
హ్మ్....కాకి ఫోటో ఎందుకు పెట్టావు అంటారా?ముందు ముందు ఒక వేల ఇవి కనపడ లేదు అంటే 
నా బ్లాగ్ లో ఉన్నాయి చూడండి అని చేపుదాము అని.మీకు తెలుసా ఇవి బాదం చెట్టు మీదే గూళ్ళు 
ఎక్కువగా పెడుతాయి.ఇక స్పూన్స్,సబ్బులు అన్నీ తీసుకుని పోయి గోల చేస్తుంటాయి .

బోలెడు ఉసిరి చెట్లు ఉంటాయి.చూసారా ఎక్కువగా కార్తీక మాసం ఈ చెట్టు కింద
లంచ్ బెల్ లో పూజ చేసుకొని వన భోజనాలు తింటూ ఉంటాము.సెలవు పెట్టె అవసరం లేకుండా :)

Sunday 10 February 2013

ఏది అందం?