Friday 22 February 2013

కొంచెం హుషారు...కొంచెం జ్ఞానం

స్వాగతం ....మా స్కూల్ లో 20,21/02/2013 లో ''ప్రపంచ మాతృభాష దినోత్సవం ''
సందర్భంగా నాటికల పోటీలు జరిపాము.నన్ను పిల్లలు ఆహార్యానికి,కధకు
సహాయం చేయమన్నారు కాని ఇవి పోటీలు కాబట్టి,అదీ కాక పిల్లలు సర్వతోముఖాభివృద్ధి
చెందేలా చేయడం నాకు ఇష్టం కాబట్టి వారినే చేసుకోమన్నాను.ఎంత చక్కగా
చేసుకున్నారో చూడండి

ఇది ఎనిమిదో తరగతి వారి ''అడివి జంతువుల ఆవేదన''నాటిక.
దీనిలో ఏనుగు వేషం వేసిన అమ్మాయికి ఉత్తమ నటి బహుమతి వచ్చింది.
ఇది ఐదవ తరగతి వారు వేసిన ''కాకి పిచుక నాటిక''దీనికి ప్రత్యెక బహుమతి

ఇది తొమ్మిదో తరగతి వాళ్ళు వేసిన ''పరమానందయ్య శిష్యుల నాటకం (గుస్వం)''
దీనికి రెండో బహుమతి వచ్చింది
ఇది తొమ్మిదో తరగతి వాళ్ళు వేసిన ''మాతృత్వం''నాటిక.పట్టణానికి వెళ్ళిన అబ్బాయి చెడుఅలవాట్లు
నేర్చుకొని అమ్మా నాన్నని మర్చిపోతే వాళ్ళు బాధ పది చనిపోవడం చూపారు.వాళ్ళే కధ వ్రాసుకున్నారు.
దీనిలో అదిగో మైక లో మాట్లాడుతున్నా అమ్మాయికి ఉత్తమ నటి బహుమతి
ఇది ఏడో  తరగతి వారి ''తెలుగు వెలుగు'' దీనిలో కూడా ఉత్తమ నటి వచ్చింది .నాటకానికి తృతీయ బహుమతి

ఆరోతరగతి వాళ్ళు ''ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి''అని వాళ్ళే నాటిక వ్రాసి వేసారు.
ముచ్చటగా ఉంది.


11 comments:

కిరణ్ కుమార్ కే said...

బాగున్నాయండి. పంచుకున్నందుకు కృతజ్ఞతలు

Anil Atluri said...

బాగుంది!

శశి కళ said...

అనిల్ గారు థాంక్యు

గ్రీన్ స్టార్ థాంక్యు (పేరు సరిగా వ్రాసానా ?)

జైభారత్ said...

గ్రేట్ వర్క్...

హరే కృష్ణ said...

హ్మ్మ్ good

Kranthi M said...

పిల్లల సృజనాత్మకత చాలాబాగుంది.

కెక్యూబ్ వర్మ said...

మంచి పని చేస్తున్నారు... అభినందనలు శశి గారు...

జ్యోతిర్మయి said...

బావుందండి మీ ప్రయత్నం. పిల్లలే కథలు వ్రాసి వేశారంటే ముచ్చటగా అనిపించింది. పిల్లలలు ఆశీస్సులు. ఉపద్యయులకు అభినందనలు.

N.V. SIVA RAMA KRISHNA said...

మా చిన్నప్పుడు, మహిళాసమాజ వార్షికోత్సవాలలో కూడా మగపిల్లలమైనా సిగ్గుపడకుండా ఆడపిల్లలతో కలిసి నటించేవాళ్ళం. మా ఉత్సాహం,పట్టుదల
వారు ప్రకటించే బహుమతులమీద కేంద్రికృతం. అందుకే, గెలుపులో కృతకృత్యులమయ్యేవాళ్ళం. నేటికాలం పిల్లలకు నాటక ప్రోత్సాహం అవసరంలేదు. వారి జీవనసరళిలోనే అదొక ప్రత్యేక విభాగం. విజృభించారంటే, ఆట విడుపుకు తుది,మొదలు తెలియదు.

శశి కళ said...

జై థాంక్యు

హరే హ్మ్ ఎందుకు?

క్రాంతి థాంక్యు

శశి కళ said...

వర్మ గారు థాంక్యు

అవును జ్యోతి గారు వాళ్లకు ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయో థాంక్యు

శివ గారు మీరు కూడా వేసే వాళ్ళన్న మాట ,థాంక్యు

Post a Comment