Friday 12 April 2013

''విజయ హో ''ఉగాది

స్వాగతం .....సుస్వాగతం .......ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న భవనం పేరు 
''కస్తూరిబా కళా క్షేత్రం''
ఇప్పుడు అక్కడ జిల్లా సాంస్కృతిక శాఖ వారి ''శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది వేడుకలు''
జరుగుతున్నాయి.చూద్దురు రండి :)

ఇది కళా క్షేత్రం లోపలి బాగం 


ఇదిగో ఇదే వేదిక.చక్కగా మామిడి కాయలు నిజం వి వేలాడ  దీసి చక్కగా సిద్ధం చేసారు 

ఎడమ నుండి రెండో ఆయన మా కలక్టర్ ''బి.శ్రీధర్''గారు .తిక్కన కళా పీటం వారి ''క్యాలండర్''
ఆవిష్కరిస్తున్నారు.మధ్యలో ఉన్నదీ దాని అధ్యక్షులు ''ఆలూరి శిరోమణి శర్మ''గారు,ఆయన పక్కన డి.పి.ఆర్ .ఓ
రామి రెడ్డి గారు .

తెలుగు వారి పండుగ మంగళ వాయిద్యాలతో నే మొదలు అవుతుంది .''వాతాపి గణపతిం ''నాదస్వర
కచ్చేరి

పంచాంగ శ్రవణం

కోయిల కూతలకు మనసు పులకించిన కవి కోయిలలు జత కలపకుండా ఎలా ఉండగలవు?
కవి సమ్మేళనం

అక్కడ ఏమి జరుగుతుంది?
మధ్యలో కలెక్టర్ గారి పక్కన ఉన్న ''వాయుగుండ్ల.శశికళ''(నేనే) రచించిన 
''స్వర్ణ ముఖీ సవ్వడులు''నానీల కవితా సంకలనం పుస్తకావిష్కరణ 



ఎడమ నుండి మూడవ వారు జిల్లా జడ్జి  శ్రీ రాములు గారు,పక్కన కలక్టర్ గారు ,పక్కన నేను,
నెరసం అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు,పక్కన జాయింట్ కలక్టర్ లక్ష్మి కాంతం గారు.


ఇక చివర చిన్నారుల ''సాంస్కృతిక ప్రదర్శనలు''
చక్కగా నెల్లూరు అంతా (11/4/2013) కేబుల్ నెట్ వర్క్ వాళ్ళు ''లైవ్ టెలికాస్ట్''
చేసారు.అందరు చక్కగా చూసి పండుగను ఆనందంగా మది నింపుకున్నారు.
ఇంకో సారి ''శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు''



8 comments:

కిరణ్ కుమార్ కే said...

బాగున్నాయండి, చివరి ఫోటోలో పాపలు ముద్దుగా ఉన్నరు. మీకు అభినందనలు మరియు ఉగాది శుభాకాంక్షలు .

మాలా కుమార్ said...

అభినందనలు .

శశి కళ said...

గ్రీన్ స్టార్ గారు,మాల గారు థాంక్యు

Padmarpita said...

కళ్ళకి కట్టినట్లు చెప్పారు....అభినందనలు!

Unknown said...

hearty congratulations sasi sister... good luck for future scripts... keep going... convey my wishes to bavagaru, menakodalu and menalludu.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ పుస్తక ఆవిష్కరణ శుభ సందర్భంలో మీకు అభినందనలు.

పెద్ద పెద్ద వారితో పరిచయాలు పెంచేసుకుంటున్నారు. ఎప్పుడో ఏ రికమెండేషన్ కోసమే వస్తాను మీ దగ్గరకి.......దహా.

హరే కృష్ణ said...

Congratulations :)

శశి కళ said...

padmaarpitha gaaru thank you

hare ,raja annayya thank you

bulusu gaaru :))))))

Post a Comment