Tuesday 12 November 2013

కధలు .... బాబోయ్ కధలు :)


స్వాగతం ..... సుస్వాగతం . మా స్కూల్ లో 8/11/2013 నుండి 12/11/2013 వరకు నేను ఒక
కధా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాను . ఈ రోజు పోటీ నిర్వహించాము .

ఏదో పది లేదా ఇరవై కధలు వస్తాయి అనుకున్న మాకు  ఐదు నుండి సీనియర్ ఇంటర్
పిల్లల వరకు కలిసి ఏకంగా ''నూటా ఐదు ''కధలు మా దోసిట్లో  పోసేసరికి కళ్ళు తిరిగినంత
పని అయింది . ఇంకా విశేషం ఏమిటంటే ''వాళ్ళ కధలకు వాళ్ళే బొమ్మలు కూడా వేసారు ''

చిన్నప్పటి కధలు , సృజనాత్మక కధలు ,నీతి కధలు ,హాస్య కధలు ,జంతువుల కధలు ,
ఇంకా .... అనువాద కధలు . చక్కగా మంచి కధనం తో ఇంగ్లీష్ కధలను కూడా అనువదించేసారు .

ఈ రోజు నెల్లూరు బాల భవన్ డైరక్టర్ గారు వారికి షీల్డ్స్ ,సర్టిఫికెట్స్ ఇచ్చారు ,
ఈ విశేషాలు చూడాలి అంటే ''పద్నాలుగో తేది ఈ టివి టు లో ఆంధ్రావని ''లో చూడండి .

ఈ కధలు ఏమి చేయాలి అన్నదే ఇప్పుడు నాకు సమస్య .








Monday 7 October 2013

What's going on?

Wednesday 26 June 2013

ప్రకృతి కాంత కు ఎన్నెన్ని హొయలో ....









చిట్టి మబ్బు .... చిట్టి మబ్బు ఎక్కడున్నావే ?రా చక చక రా .... 
అనగానే ఇదిగో ఇలాగ మా దగ్గరకు వచ్చేస్తుంది . 
హమ్మయ్య వాన వస్తుంది అనుకోగానే ఇదిగో మా సూర్యం బాబు 
ఇలాటి ఫోజు లు ఇచ్చేస్తాడు .... నల్ల తెర లో నుండి తొంగి చూస్తూ 

ప్రకృతి కాంత కు ఎన్నెన్ని హొయలో .... 


కరకు గర్జనల మేనికి మెరుపు హంగు గూర్చిన వాడినేమి అడిగేది ?ఏమి కోరేది ?వాడి నేమి అడిగేది ?



ఇదిగో సాయంత్రం ఇలాంటి పెయింటింగ్స్ ప్రకృతి చూపిస్తూ ఉంటె .... సాండ్ పెయింటింగ్స్ మారినట్లు
సేకనకు ఒక సారి మారిపోతూ ఉంటె ... అబ్బ ఒకటే క్లిక్ అనిపించడమే :)

ఎలా ఉంది?అర గంటలో పాపం మా సూర్యం బాబు ఇలాగ లైటింగ్ మారుస్తూ ,ఫోజ్ లు
మారుస్తూ మూడు వందల అరవై ఫోజులు పెట్టాడు అనుకోండి

అన్ని పెడితే బోర్ కొడుతుందేమో అని పెట్ట లేదు . పాపం ఈయన రెస్ట్  తీసుకో ,ఇవన్ని ఎందుకు  అంటారు .
నాకు ఇలా ఆకాశం చూస్తేనే  బోలెడు రెస్ట్ ..... ఈ సారి ఇంకొన్ని ఫోటో లతో


Tuesday 4 June 2013

మా సూర్యం బాబు గారు :)

ఇదిగో చూడండి మా సూర్యం బాబు గారు ఆకాశం లో ఆఫీస్ చూసుకొని 
భూదేవి వైపు చూస్తున్నాడు 

అక్కడ నుండి చూసేసరికి భూదేవి మీద బోలెడు ప్రేమ వచ్చింది చూడండి 


కనిపించిందా ? ఇంకా చుట్టూ ఏదో గుఱ్ఱం ఆకారం గమనించారా ?

ఇక్కడ చూడండి సూర్య నారాయణ్ గారు ఎలా ఉన్నారో ?కింద ఉన్నది నేల ..... 
అది ఎండిపోయిన మా స్వర్ణముఖి నది అన్న మాట . 
ఇవండీ మా కొత్త అపార్ట్మెంట్ పై నుండి నా కన్ను చూసిన దృశ్యాలు :))







Friday 10 May 2013

గృహ ప్రవేశం

గృహ ప్రవేశం 
3/5/2013 శుక్రవారం రాత్రి గృహ ప్రవేశం 
గో పూజ 

ఆవు దూడ ముందు ఇంటిలో తిరిగితే ఇల్లంతా పిల్లా పాపలతో కళ కళ లాడుతుంది ,
గోవు ను పూజిస్తే మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్లు .... 
ముందు గృహిణి ధాన్యపు కలిశం   ఇంటిలోకి నెట్టి  లోపలికి  రావాలి . 
ఎంత చక్కగా ధాన్యం  ఇల్లంతా చల్లినట్లు పడితే అంత సిరి సంపదలు కలిసి వస్తాయి 


ఇప్పుడు అసలు కధ ..... పాలు పొంగించడం  . 
ఇప్పటికి ఎన్ని గృహ ప్రవేశాలు నేను చేసినా ఈ కట్టెలపొయ్యి మీద పాలు పొంగించడం 
నాకు పెద్ద పరీక్ష . అప్పటికి పక్కన సహాయానికి ఎందరు ఉన్నారో . 
పాలు పొంగించడానికే  .... అబ్బ పొగ ముక్కు ,కళ్ళు మంటలు . 
అసలు కట్టెల పొయ్యి మీద వంట అంటే ఎంత కష్టం 
ఇది శనివారం ఉదయం సత్యనారాయణ స్వామీ వ్రతం 



బెస్ట్ విషస్ చెప్పిన వాళ్లకు థాంక్యు లు :) 

Monday 6 May 2013

మేము సైతం .....ప్రపంచ రికార్డ్ కు గొంతు విప్పాము :)

Wednesday 24 April 2013

స్నాప్స్ బిసైడ్ మై పాత్




పాప ఫోటో నేను  తియ్యలేదు.మా బావ గారి మనుమరాలు.తరువాతి తరం స్టార్ట్ అయింది కదా.
అందుకు షేర్ చేసాను.


Friday 12 April 2013

''విజయ హో ''ఉగాది

స్వాగతం .....సుస్వాగతం .......ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న భవనం పేరు 
''కస్తూరిబా కళా క్షేత్రం''
ఇప్పుడు అక్కడ జిల్లా సాంస్కృతిక శాఖ వారి ''శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది వేడుకలు''
జరుగుతున్నాయి.చూద్దురు రండి :)

ఇది కళా క్షేత్రం లోపలి బాగం 


ఇదిగో ఇదే వేదిక.చక్కగా మామిడి కాయలు నిజం వి వేలాడ  దీసి చక్కగా సిద్ధం చేసారు 

ఎడమ నుండి రెండో ఆయన మా కలక్టర్ ''బి.శ్రీధర్''గారు .తిక్కన కళా పీటం వారి ''క్యాలండర్''
ఆవిష్కరిస్తున్నారు.మధ్యలో ఉన్నదీ దాని అధ్యక్షులు ''ఆలూరి శిరోమణి శర్మ''గారు,ఆయన పక్కన డి.పి.ఆర్ .ఓ
రామి రెడ్డి గారు .

తెలుగు వారి పండుగ మంగళ వాయిద్యాలతో నే మొదలు అవుతుంది .''వాతాపి గణపతిం ''నాదస్వర
కచ్చేరి

పంచాంగ శ్రవణం

కోయిల కూతలకు మనసు పులకించిన కవి కోయిలలు జత కలపకుండా ఎలా ఉండగలవు?
కవి సమ్మేళనం

అక్కడ ఏమి జరుగుతుంది?
మధ్యలో కలెక్టర్ గారి పక్కన ఉన్న ''వాయుగుండ్ల.శశికళ''(నేనే) రచించిన 
''స్వర్ణ ముఖీ సవ్వడులు''నానీల కవితా సంకలనం పుస్తకావిష్కరణ 



ఎడమ నుండి మూడవ వారు జిల్లా జడ్జి  శ్రీ రాములు గారు,పక్కన కలక్టర్ గారు ,పక్కన నేను,
నెరసం అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు,పక్కన జాయింట్ కలక్టర్ లక్ష్మి కాంతం గారు.


ఇక చివర చిన్నారుల ''సాంస్కృతిక ప్రదర్శనలు''
చక్కగా నెల్లూరు అంతా (11/4/2013) కేబుల్ నెట్ వర్క్ వాళ్ళు ''లైవ్ టెలికాస్ట్''
చేసారు.అందరు చక్కగా చూసి పండుగను ఆనందంగా మది నింపుకున్నారు.
ఇంకో సారి ''శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు''