ఉరకలెత్తే అందం .... హోగినికల్స్
బెంగుళూర్ కి రెండు గంటల ప్రయాణ దూరం లో ఉన్నాయి ఈ ''హోగినికల్స్ ''
జలపాతాలు . ఎండాకాలం సెలవల్లో ఎలాగైనా వాయుగుండ్ల ఫామిలీస్ అందరు
రోజువారి పనుల నుండి ఆటవిడుపుగా వెళ్ళాలి అని మా మరుదలు ,తోడి కోడళ్ళు
కలిసి వేసిన ప్లాన్ ఇది .
అదిగో చుట్టూ రాతి కొండల మీద నుండి కిందకు ఉరికే జలపాతాలు . ఎన్నో దగ్గరల
ఇలా నీరు ప్రవహించి రాళ్ళ మధ్యలో చిన్న గుహలుగా ఇంకా రాళ్ళు రక రకాల
రూపాలలో ఏర్పడ్డాయి . చెట్ల వెళ్ళు కూడా రక రకాల రూపాలు .
మే లో ఎక్కువ జల పాతాలు లేవు కాని ఇప్పుడు ''బోట్ షికారు '' (పుట్టెలు )
ఉంటుంది . ఆగస్ట్ లో పైన కృష్ణ రాజ సాగర్ డాం నుండి నీరు వదిలి నపుడు
బోలెడు జలపాతాలు కాని బోట్ షికారు ఉండదు .
ఇదిగో ఇక్కడే మన ప్రయాణం మొదలు అవుతుంది ఆ చిన్న పడవల్లో . శాకాహారులకు
చుట్టూ అమ్మే చేపలవంటకాలు చూస్తూ నడవాలి అంటే కష్టమే . తల వంచుకొని నీటి అందాలు
చూడటమే పరిష్కారం .
చూసారా .... నీటి ప్రవాహం వలన చెట్ల వేళ్ళు ఎన్ని ఆకారాలు సంతరించుకున్నాయో !
ఇందాక ఎక్కిన బోట్స్ నుండి దిగి ఇక్కడ మళ్ళా ఎక్కుతాము . ఇప్పుడు మనలను
కొండల మధ్యగా వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకొని వెళుతారు .
చూసారా రెండు వైపుల రాళ్ళు నీటి ప్రవాహం వలన ఎలాంటి ఆకారాల్లో ఉన్నాయో !
ఇక్కడ ప్రస్తుతం ఎనబై అడుగుల లోతు నీరు ఉందని చెప్పారు .
ఇలా రాళ్ళ మధ్య ప్రయాణించి ఒక ఏరు లాంటి ప్రదేశానికి చేరుకుంటాము .
ఇక అక్కడ మసాజ్ లు చేయించు కొనేవాళ్ళు ,పిల్లలు, తల్లులు,పెద్ద వాళ్ళు నీళ్ళలో
ఆటలాడుకుంటూ కనిపిస్తారు . ఈ మసాజ్ లు ఏమిటో బోలెడు నూనెను నీటిలో
కలిపెస్తూ ,అసలు వాటర్ కూడా మురికిగా అయిపోతున్నాయి . మళ్ళా దీనికి
కూడా ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలేమో . నాకు విసుగు వేసి కనీసం
నీళ్ళలో కాలు కూడా పెట్టలేదు .
ప్రకృతి మనకు చూచి ఆనందించడానికి బోలెడు అందాలు మనకు ఇస్తే వాటిని పాడు
చేసి మనం ఆనందం పొందుతున్నాము . ఎవరు నేర్పించాలి మనకు
మంచి చెడ్డలు ?

4 comments:
ఫొటోలు బాగున్నవి. అందించినందుకు అభినందనలు.
చాలా బాగుదండి ఈ ప్రదేశం, ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. చూపించినందుకు ధన్యవాదాలు.
>>ప్రకృతి మనకు చూచి ఆనందించడానికి బోలెడు అందాలు మనకు ఇస్తే వాటిని పాడు చేసి మనం ఆనందం పొందుతున్నాము .
ప్చ్ ...
చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా.
chinthaa gaaru ,anil gaaru pedhdhalaku dhanyavaadamulu.
meeru naa blog choodatame naaku aanandham.
kiran garu thank you.
Post a Comment