Tuesday 13 May 2014

ఉరకలెత్తే అందం .... హోగినికల్స్

ఉరకలెత్తే అందం .... హోగినికల్స్ 
 బెంగుళూర్ కి రెండు గంటల ప్రయాణ దూరం లో ఉన్నాయి ఈ ''హోగినికల్స్ ''
జలపాతాలు . ఎండాకాలం సెలవల్లో ఎలాగైనా వాయుగుండ్ల ఫామిలీస్ అందరు 
రోజువారి పనుల నుండి ఆటవిడుపుగా వెళ్ళాలి అని మా మరుదలు ,తోడి కోడళ్ళు 
కలిసి వేసిన ప్లాన్ ఇది . 
అదిగో చుట్టూ రాతి కొండల మీద నుండి కిందకు ఉరికే జలపాతాలు . ఎన్నో దగ్గరల 
ఇలా నీరు ప్రవహించి రాళ్ళ మధ్యలో చిన్న గుహలుగా ఇంకా రాళ్ళు రక రకాల 
రూపాలలో ఏర్పడ్డాయి . చెట్ల వెళ్ళు కూడా రక రకాల రూపాలు . 

మే లో ఎక్కువ జల పాతాలు లేవు కాని ఇప్పుడు ''బోట్ షికారు '' (పుట్టెలు )
ఉంటుంది . ఆగస్ట్ లో పైన కృష్ణ రాజ సాగర్ డాం నుండి నీరు వదిలి నపుడు 
బోలెడు జలపాతాలు కాని బోట్ షికారు ఉండదు . 

ఇదిగో ఇక్కడే మన ప్రయాణం మొదలు అవుతుంది ఆ చిన్న పడవల్లో . శాకాహారులకు 
చుట్టూ అమ్మే చేపలవంటకాలు  చూస్తూ నడవాలి అంటే కష్టమే . తల వంచుకొని నీటి అందాలు 
చూడటమే పరిష్కారం . 


చూసారా .... నీటి ప్రవాహం వలన చెట్ల వేళ్ళు ఎన్ని ఆకారాలు సంతరించుకున్నాయో !

ఇందాక ఎక్కిన బోట్స్ నుండి దిగి ఇక్కడ మళ్ళా ఎక్కుతాము . ఇప్పుడు మనలను 
కొండల మధ్యగా వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకొని వెళుతారు . 



 చూసారా రెండు వైపుల రాళ్ళు నీటి ప్రవాహం వలన ఎలాంటి ఆకారాల్లో ఉన్నాయో !
ఇక్కడ ప్రస్తుతం ఎనబై అడుగుల లోతు నీరు ఉందని చెప్పారు .
ఇలా రాళ్ళ మధ్య ప్రయాణించి ఒక ఏరు లాంటి ప్రదేశానికి చేరుకుంటాము . 
ఇక అక్కడ మసాజ్ లు చేయించు కొనేవాళ్ళు  ,పిల్లలు, తల్లులు,పెద్ద వాళ్ళు  నీళ్ళలో 
ఆటలాడుకుంటూ కనిపిస్తారు . ఈ మసాజ్ లు ఏమిటో బోలెడు నూనెను నీటిలో 
కలిపెస్తూ ,అసలు వాటర్ కూడా మురికిగా అయిపోతున్నాయి . మళ్ళా దీనికి 
కూడా ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలేమో . నాకు విసుగు వేసి కనీసం 
నీళ్ళలో కాలు కూడా పెట్టలేదు . 
ప్రకృతి మనకు  చూచి ఆనందించడానికి బోలెడు అందాలు మనకు ఇస్తే వాటిని పాడు 
చేసి మనం ఆనందం పొందుతున్నాము . ఎవరు నేర్పించాలి మనకు 
మంచి చెడ్డలు ?