Monday, 14 January 2013

మా శివాలయం లో గోదా దేవి రంగనాయకుల కళ్యాణం

''మాంగల్యం తంతునానేనా లోక జీవన హేతువా''
భగవంతుని కళ్యాణం లోకానికి మంచి జరగాలి అని.
మరి పండుగ రోజు అందరు పనులు మానుకొని ఇలా కలిసి మెలిసి 
కళ్యాణం లో పాల్గొనడం ఊరు అంతటికి సంతోషమే కదా....లేకుంటే 
అందరు టి.వి. లకు అతుక్కొని పోయి ఎవరికి వారే యమునా తీరే.

మా శివాలయం ఆవరణలో కృష్ణ మందిరం,శివాలయం,వాసవి కన్యకా పరమేశ్వరి గుడి,
కళ్యాణ మండపం,రామాలయం,పక్కన షిర్డీ సాయిబాబా గుడి ఉంటాయి.
అంటే  ప్రతి రోజు అక్కడ ఏదో ఒక సందడి ,పూజలు.

ఇదిగోనండి.....పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు అదే....గోదాదేవి,రంగనాధులు కళ్యాణ మండపానికి
బయలుదేరారు.

మేము అబ్బాయి తరుపున పెళ్లి పీటల మీద కూర్చున్నాము.అందుకు ఆయనను తీసుకొని బయలుదేరాము.
వెనుక కృష్ణుని పాల రాతి విగ్రహం చూసారా?చాలా బాగుంటుంది.
మధ్యలో ఎదురుకోలు జరిగే ముందు విడిది.కోలాట సేవ.చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా
అందరు కోలాటం వేస్తారు.స్వామీ వారికి సేవగా.....


కళ్యాణం వేదిక మీద జరుగుతూ ఉంది.కంకణ ధారణ,యజ్ఞోపవీత ధారణ,మాంగల్య పూజ,
కన్యా దానం,జిలకర బెల్లం,మాంగల్య ధారణ,తలంబ్రాలు .....ఎంతో వేడుకగా జరిగాయి...
ఏకాంత సేవ అనంతరం వివాహ భోజనాలు.....అంతకు ముందు భోగి పండుగ లేదు అంట.
గోదా దేవి స్వామీ వారికి భోగ్యం అయింది కాబట్టి భోగి పండుగ అంట.
ఇరుగో కొత్త పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు .....అమ్మవారి కుచ్చులు చూసారా?పోయిన సారి
వసూలు అయిన డబ్బులుతో తయారు చేయించాము.

ఇదే మా శివాలయం.రేపటి నుండి  ''ఏటి పండుగ''అంటే అందరు స్వర్ణముఖీ నదీ తీరానికి
వెళతారు.అక్కడ ఇంకో శివాలయం  ఉంటుంది.కొందరు గొబ్బెమ్మలను నీళ్ళలో ఓలలాడిస్తారు.
పిల్లలు గాలి పటాలు,రంగుల రాట్నాలు.కొన్ని పోటీలు కూడా  జరుగుతాయి.ఇసకేస్తే రాలని
జనాలు అంటారు కదా అలాగా ఉంటుంది.




మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు.పాలరాయి విగ్రహం బాగుంది కదా....


6 comments:

Lakshmi Naresh said...

బాగుంది..ఇసకేస్తే రాలనంత జనం ఫోటోలు కూడా పెట్టండి

మాలా కుమార్ said...

స్వామివారి కి అమ్మా నాన్నలయ్యాన్నమాట .శుభం .
మీ గుడి , గుడి లోని దేవుళ్ళు , పెళ్ళి సంబరం బాగున్నాయి .

మాలా కుమార్ said...

ఇప్పుడు టెంప్లెట్ బాగుంది .

Unknown said...

శశి సిస్టర్ కళ్ళకు కట్టినట్లుగా అధ్బుతంగా ఉంది.

శశి కళ said...

లక్క్ష్మి నరేష్ ఆ జనాలను ఫోటో తీయాలి అంతే నేను విమానం ఎక్కి తియ్యాలి :)

మాల గారు నాకు కోదా భలే సంతోషం వేసింది.మనం ఆ అమ్మవారిని దానంగా పొందాలి అంతే యెంత అదృష్టం

శశి కళ said...

రాజా అన్నయ్య థాంక్యు.మీకు ఈ కళ్యాణం గూర్చి తెలుసు కదా

Post a Comment