ఇది మా నెల్లూరు పుర మందిరము అంటె ''టౌన్ హాల్''.ఇది నెల్లూరు లో ట్రంక్ రోడ్
మీద ఉంది.దీని పేరు రావ్ బహద్దూర్ ''రేబాల లక్ష్మి నరసారెడ్డి పుర మందిరం''
ఇక్కడ చక్కాగా సాహిత్య కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి.ఈ వేదిక మీద
జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం ,బహుమతులు,అవార్డ్ లు అందుకోవడం
ఎవరికైనా మర్చిపోలేని జ్ఞాపకం.నేను కూడా ఇక్కడ కొన్ని బహుమతులు
అందుకొని ఉన్నాను.
మధ్యలో కొన్ని మార్పులు చేసినా ఇది బ్రిటీష్ వారు ఉన్నప్పటి కట్టడం,
అసలు ఒక్కో గోడ మందం ఒక మీటర్ కు కొంచెం తక్కువ అంటె ఊహించుకోండి
యెంత బలంగా ఉంటుందో.ఏమిటి లోపల చూస్తారా....సుస్వాగతం :))
కుర్చీల వెనుక వాయిద్యాల బొమ్మలు గమనించండి
ఇదిగో ఇదే ప్రధాన వేదిక.ఈ రోజు ఎందుకు వెళ్లావు అంటారా?ఈ రోజు కాదులెండి
ఆదివారం అంటె ఇరవయ్యో తేది ఇక్కడ మా ''నెరసం''వారు జాతీయ స్థాయి కవి సమ్మేళనం
నిర్వహించారు.నేను అందులో కార్యనిర్వాహక సభ్యురాలిని కాబట్టి వెళ్లాను.
కవి సమ్మేళనం చక్కగా జరిగింది.
ముందుగా ''గురు కృప''విద్యార్ధినులు వినాయకుని పై చేసిన నృత్యం అందరిని అలరించింది.
తరువాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ హైకోర్ట్ జస్టీస్ ''ఎల్.నరసింహం''గారు ,రచయితలు
''సోమిరెడ్డి.జయ ప్రద''గారు,''కొండ్రెడ్డి.వెంకటేశ్వర రావు''గారు,ఇంకా మా అధ్యక్షులు
జయ ప్రకాష్ గారు,సెక్రటరీ పాతూరి .అన్నపూర్ణ గారు ,కోశాదికారి మాటేటి.రత్నప్రసాద్
గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసారు(ఫోటో ఏది అంటె....మగ వాళ్ళు అందరు
అడ్డం నిలుచుకున్నారు.తియ్యలేదు)
తరువాత మాకు అందిన ఆరువందల కవితలలో మొదటి మూడు స్తానాల్లో వచ్చిన వారికి
బహుమతి ప్రధానం జరిగింది.తరువాత కవి సమ్మేళనం లో అన్ని ప్రదేశాల నుండి వచ్చిన
కవులతో ఎనిమిది ఆవ్రుతాలు జరిపి ఒక్కో ఆవ్రుతానికి ప్రైజ్ లు ఇవ్వడం జరిగినది.
ముగింపు సభలో కాకాణి.గోవర్ధన్ రెడ్డి గారు,ఎం.ఎల్.ఏ.ముంగమూరి .శ్రీధర్ కుమార్ రెడ్డి గారు
ప్రముఖ కవి ''రస రాజు''గారు పాల్గొన్నారు.
''రస రాజు ''గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ .......
వచ్చే నెలలో ''సోమిరెడ్డి.జయ ప్రద''గారి మీద హైదరాబాద్ లో సెమినార్ జరిగే సందర్భంగా
ఆమెను సన్మానించాము.తరువాత ఎలాగు మాకూ ప్రశంస లు ఉంటాయి.ఇలాగ కార్యక్రమం
బాగా జరిగింది.
ఇక్కడ రెండు మాటలు.....రస రాజుగారు మాట్లాడుతూ ఒక గజల్ గుర్తు చేసారు.
గజల్ కి సాహిత్యము మరియు గాత్రం చాలా ప్రధానం అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటె ఈ గజల్ నేను ఒక సభలో ''గజల్ శ్రీనివాస్''పాడితే విన్నాను.ప్రతీ వాక్యానికి
చప్పట్లు మ్రోగిపోయాయి.ఇక్కడ కూడా అలరించింది.గాత్రం సరిపోలేదు.మీరు వినే ఉంటారు.
''తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా
నడుం వాల్చావా లేదా అని అన్నానా ఎపుడైనా ......
చీర నీకు బాగుందని అన్నానే కాని
ఆ చీరకు నువ్వే సొగసని అన్నానా ఎపుడైనా ......
తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా......
నీ జడలో పూల పరిమళాలు పీల్చానే కాని
నీ మనసులోని పరిమళాలు పీల్చానా ఎపుడైనా....
తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా....
ఇలా భార్యను పొగుడుతూ సాగుతుంది....నాటకీయత
కావొచ్చు కాని ఒకరిని ఒకరు ప్రశంసించు కోవడం
వారి మధ్య అనుబంధాన్ని గట్టిగా చేస్తుంది.
పోనీలే అని ఈయనకు వినిపిస్తే అంటారు
''అదేమిటి అయ్యన్నీ చేసినది ఆయనే కదా....మళ్ళా భార్యను చేసానా?
అని అడుగుతాడు.....ఆయనకు ఏమైనా తిక్కా?అంటారు.
నిజమే సుమా ...సాహిత్యపు వెల్లువలో గమనించలేదు కాని....
ఆయన అన్నది నిజమే........
3 comments:
చాలా బాగా ప్రెజెంట్ చేసారండీ కార్యక్రమాన్ని... అభినందనలతో..
శశి కళ గారు, బాగుందండి. టౌన్ హాలు, ఆ గోడకు ఆనుకుని వినాయకుని గుడి, మా కాలేజీ ..........., గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
thank you varma garu
swati kevvvvvvvvvvv v.r.c.studenta?
Post a Comment